కన్నిటి బొట్టు చేసే ప్రతి శబ్దాన్ని
కలం తో వినిపిస్తున్న
నవ్వు చూపించే ప్రతి వెలుగుని
కలం తో చూపిస్తున్న
భయం వల్ల కలిగే చలిని
కోపం వల్ల కలిగే వేడిని
చిరాకు వల్ల కలిగే గందరగోళాన్ని
అసూయ వల్ల కలిగే తూఫానుని
అన్నిటిని కలంతోనే ప్రపంచానికి పరిచయం చేస్తున్న
మాట్లాడ్డం మర్చిపోయి నా చేతలన్ని
నా రాతలతో అలంకరిస్తున్న
ఒంటరిగా మాట్లాడుకునే వాడు పిచ్చొడు
అయ్యాడు
ఒంటరిగా రాసుకునేవాడు కవి అయ్యాడు
Saturday, May 13, 2017
కృష్ణం
Friday, April 14, 2017
కృష్ణం,గాలి మాటలు
ఈ క్షణం నా మీద నుండి వీచే గాలి
ఎన్ని చెట్లను దాటి వచ్చిందో
ఎన్ని కొమ్మలను తాకి వచ్చిందో
ఎన్ని ఆకులను కదిలించిందో
గాలికి కూడా మాటలు వస్తే ఆ చెట్ల భావాలు , కొమ్మల భాధలు , ఆకుల కధలు ను చెప్పమనేవాడిని
అమ్మకానికి ,నమ్మకానికి తేడ తెలియని మనుషుల కధలు కన్న "గాలి మాటలు" నయం
Tuesday, April 4, 2017
Friday, March 24, 2017
కృష్ణం
మనిషి బతుకే బానిస బతుకు
బొతుకుల బొంత అయిన బతుక్కి వ్యసనాలే అతుకులు
అప్పుడు
తన నవ్వులో వెలుగుకి బానిస
ఇప్పుడు
సిగరెట్ చివరన మంటకు బానిస
అప్పుడు
తన మాటల్లో మత్తుకు బానిస
ఇప్పుడు
మందులో మత్తుకు బానిస
అప్పుడు
తన చూపుకు బానిస
ఇప్పుడు
కొత్త కైేపుకి బానిస
కోతకు గురై రాతకు బానిస
గాయాలతో గేయాలకు బానిస
బ్రతకలేక చితికి బానిస
చావ లేక గతికి బానిస
కొత్త పరిచయాలకు బానిస
కొత్త మార్పులకు బానిస
పసలేని వ్యసనాలకి బానిస
అందరికి మనుషుల్ని మార్చడం చేతకాదు
ఖాళి జీవితాలలో ఎన్ని గాలులు చేరిన ఉపిరి మాత్రం ఒక్కటే
ఇలా ఉన్నంత మాత్రాన నేను బలహీనుడుని కాను
నాకు నటించడం వచ్చు
నాకు నన్ను మోసం చేసుకోవడం వచ్చు
అలా చేస్తేనే ఓప్పు అనుకుంటే
తప్పోప్పుల నిగూఢా అర్ధాన్ని నిఘంటవులో మార్చాల్సిందే
Tuesday, January 3, 2017
కృష్ణం
పదాలను వదులుగ వదులుతూ
పౌర్ణమి రోజు కడలికి ఎదురు వెళ్లాడానికి భయపడి
చంద్రుడిని కప్పేయలేక కళ్లు మూసుకుంటే
సరిపోతుందా?????
అలుసుగా గొలుసుకొట్టు కోపాన్ని చిరాకుని ప్రదర్శిస్తూ
గొడుగులు మాడిపోయే మనుషులు కాలిపోయే ఎండకు బలయ్యేందుకు సిధ్దం కాలేక
చప్పుడు చేసినందుకు సిగ్గు పడితే
సరిపోతుందా ????????
కుతి మంటలు చితి మంటలు
నిప్పురవ్వల తుఫానులో, వేడి సెగల సుడిగుండంలో
కదలక బెదరక చెదరక
చలిలో వణుకుతూ నిల్చున్న
రాయినై గుండెను బండను చేసుకున్న ప్రతి మనిషి
అయితే దేవుడైన అయ్యిండాలి లేదా
దెయ్యమైనా అయ్యండాలి
బహూశ ఉచ్చారణలో కూడా చల్లదనాన్ని కొల్పోని
మహానుభావులను చూసి అలా తయారు అయ్యరేమో !!!!!!!!!!