Friday, March 24, 2017

కృష్ణం

మనిషి బతుకే బానిస బతుకు
బొతుకుల బొంత అయిన బతుక్కి వ్యసనాలే అతుకులు

అప్పుడు
తన నవ్వులో  వెలుగుకి  బానిస
ఇప్పుడు
సిగరెట్ చివరన మంటకు బానిస

అప్పుడు
తన మాటల్లో  మత్తుకు బానిస
ఇప్పుడు
మందులో మత్తుకు బానిస

అప్పుడు
తన చూపుకు  బానిస
ఇప్పుడు
కొత్త కైేపుకి  బానిస

కోతకు గురై రాతకు బానిస
గాయాలతో గేయాలకు బానిస

బ్రతకలేక చితికి బానిస
చావ లేక గతికి బానిస

కొత్త పరిచయాలకు బానిస
కొత్త మార్పులకు బానిస

పసలేని వ్యసనాలకి బానిస

అందరికి మనుషుల్ని  మార్చడం చేతకాదు
ఖాళి జీవితాలలో ఎన్ని గాలులు చేరిన  ఉపిరి మాత్రం ఒక్కటే

ఇలా ఉన్నంత మాత్రాన నేను బలహీనుడుని కాను
నాకు నటించడం వచ్చు
నాకు నన్ను మోసం చేసుకోవడం వచ్చు
అలా చేస్తేనే ఓప్పు అనుకుంటే
తప్పోప్పుల నిగూఢా  అర్ధాన్ని  నిఘంటవులో మార్చాల్సిందే

No comments:

Post a Comment