కన్నిటి బొట్టు చేసే ప్రతి శబ్దాన్ని
కలం తో వినిపిస్తున్న
నవ్వు చూపించే ప్రతి వెలుగుని
కలం తో చూపిస్తున్న
భయం వల్ల కలిగే చలిని
కోపం వల్ల కలిగే వేడిని
చిరాకు వల్ల కలిగే గందరగోళాన్ని
అసూయ వల్ల కలిగే తూఫానుని
అన్నిటిని కలంతోనే ప్రపంచానికి పరిచయం చేస్తున్న
మాట్లాడ్డం మర్చిపోయి నా చేతలన్ని
నా రాతలతో అలంకరిస్తున్న
ఒంటరిగా మాట్లాడుకునే వాడు పిచ్చొడు
అయ్యాడు
ఒంటరిగా రాసుకునేవాడు కవి అయ్యాడు