ఆమావాస్య రోజు చుక్కల్ని
పూర్ణిమ రోజు చంద్రుడిలో మచ్చల్ని లెక్కపెడుతూ
నిశీలో ఉన్నప్పుడు వెలుగు కోసం
వెలుగులో ఉన్నప్పుడు నీడ కోసం పరిగెడుతూ
వెన్నెల వన్నెల
నవ్వుల నెలవిలా
నిలువెల్ల
నలుపై తెలుపై
విరుపై గెలుపై
తగలబెడుతుంటే
జ్వలిస్తూ చీకట్లో కలిసిపోతావో
జ్వాలముఖివై కాగడలా చీకట్లో దారి చూపుతావో
మబ్బుల చాటున నిలబడి నీడలో కలిసిపోతావో
ఎండలో నిలబడి నలుగురికీ నీడను ఇస్తావో
నీ రాతలో కాదు నీ చేతిలో ఉంది
No comments:
Post a Comment