నీ నవ్వు నా చెవులకు కొత్త శబ్దాలని పరిచయం చేసింది
నాగుండె చప్పుడుకి కూడా శృతి లయలు ఉంటాయని చెప్పింది
నీ చూపు నా కళ్ళకు కొత్త రంగల్ని అద్దింది
నలుపు తెలుపులకు కూడా భావాలుంటాయని
నేర్పించింది
కదిలే కాలం నీ నడక ఒకటే నువ్వు ఆగితే నా చూట్టూ ప్రపంచం ఆగిపోయింది
ఎదురు చూసే ఆశల వృక్షానికి అడుగులతో ఊపిరి అందించి కోత్త పూలను పూయించావు
నా నీడ చెంతకు నువ్వు చేరితే ఆ పరిమళాలతో
స్వాగతం చెప్తాను
సుగంధల సుమ వర్షం లో నిన్ను తడిపేస్తాను
ప్రశ్నల తూఫానుల మధ్య
సందేహల సుడిగుండాల చివరన
ఈదలేక ఎగరలేక
కొట్టుమిట్టాడుతోంది ప్రాణం
అలా సగం నవ్వి
సగం చూసి
నన్ను సగం చంపేసావు
నిజాలకు దూరంగా
అబద్దాలకు దగ్గరగా
బతుకుతుంటే
చూడ్డానికి వినడానికి బాగనే ఉంది
కాని నీతో పూర్తిగా చంపించుకోవాలని ఉంది
ఈ సంధిగ్దం ఇప్పట్లో తొలగదు
దీనికి జవాబు నీ దగ్గరే ఉంది
తూర్పు అయిన పడమర అయిన
మిన్ను అయిన మన్ను అయిన
నాలో వెలుగు తగ్గిపోదు
నీ నవ్వు నా కోసం కాకపోయిన
నీ చూపు నా కోసం వెతక్కపోయిన
నా చూపు నీన్ను చూసినతరువాత నవ్వడం మాత్రం ఆపదు